చెరువులోపడిన కారు : నలుగురు కళాశాల విద్యార్థులు మృతి

Dec 10,2023 09:41 #4, #car accident, #college students, #dead

చిక్‌బల్లాపూర్‌ (కర్నాటక) : కారు అదుపు తప్పి చెరువులోపడటంతో నలుగురు కళాశాల విద్యార్థులు మృతి చెందిన ఘటన కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌ వద్ద ఆదివారం జరిగింది. చిక్‌బల్లాపూర్‌ నుంచి బెంగళూరుకు వెళుతుండగా ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెరువులో పడింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను బెంగళూరు రేవా కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️