బిష్ణుపూర్‌ ఆయుధాగారం లూటీ కేసులో సిబిఐ చార్జిషీట్‌

ఇంఫాల్‌ :   బిష్ణుపూర్‌ పోలీస్‌ ఆయుధాగారం నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దోచుకున్న కేసులో ఏడుగురుపై నిందితులపై సిబిఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. గతేడాది ఆగస్టు 3న బిష్ణుపూర్‌లోని నరన్‌సీనాలోని 2వ ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌ హెడ్‌ క్వార్టర్‌లోని రెండు గదుల్లోని 300కు పైగా ఆయుధాలు, 19,800 రౌండ్ల మందుగుండు సామగ్రి, ఇతర ఉపకరణాలను కొందరు నిందితులు దోచుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల అస్సాం రాజధాని గౌహతిలో కమ్రూప్‌ (మెట్రో)లోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ముందు సిబిఐ చార్జిషీటును దాఖలు చేసింది. లైష్రామ్‌ ప్రేమ్‌ సింగ్‌, ఖుముక్చమ్‌ ధీరేన్‌ సింగ్‌ అలియాస్‌ థాప్‌ఖ్పా, మెయిరంగ్థెమ్‌ ఆనంద్‌ సింగ్‌, అథోక్పమ్‌ కాజిత్‌ అలియాస్‌ కిషోర్జిత్‌, లౌక్రక్‌పమ్‌ మైఖేల్‌ మాంగాంగ్చా అలియాస్‌ మైఖేల్‌ , కొంతౌజం రొమోజిత్‌ మైతేరు అలియస్‌ రోమోజిత్‌, కైషమ్‌ జాన్సన్‌ అలియాస్‌ జాన్సన్‌లను చార్జిషీటులో నిందితులుగా చేర్చింది.

➡️