బిజెపి ఎంపీకి చురకలు

Mar 13,2024 13:04 #BJP MP, #cpm politburo, #tweets

ఇంటర్నెట్ : సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతున్న తరుణంలో దేశంలో రాజకీయ పార్టీల ఎత్తులు, పొత్తులు ఒకవైపు, సైద్దాంతిక చర్చ, ప్రజా సమస్యలపై మరోవైపు చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాల నుండి దృష్టి మళ్లించే పనిలో  బిజెపి నేతలు నిమగ్నమై ఉన్నారు. అలాంటి వారికి సోషల్ మీడియాలో నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. తాజాగా బిజెపి రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ”భారతదేశంలో లెనిన్ విగ్రహం ఏం చేస్తుందని” ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ పోస్టుకు రచయిత, జర్నలిస్ట్ టోని జోసెఫ్ సమాధానం ఇస్తూ…”ఏమీ చేయడం లేదు. కదలకుండా అక్కడే నిలబడి ఉంది. ఎవరిపై మూకదాడి చేయలేదు. ఎన్నికల్లో గెలిచేందుకు ఘర్షణలను రెచ్చగొట్టే నకిలీ వార్తలను ప్రచారం చేసే ఛానల్ ను నడపడం లేదు. కనీసం చెత్త ప్రశ్నలు కూడా అడగటం లేదు” అంటూ పేర్కొన్నారు. ఈ పోస్టును సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు సుభాషిణి అలీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్  నకిలీ వార్తలను ప్రచారం చేసే రిపబ్లిక్ టీవి ఛానల్ కు డైరెక్టర్ గా పనిచేశారు. ఈ నేపథ్యంలో చేసిన జోసెఫ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

➡️