తమిళనాట రెండో అతి పెద్ద అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తా : సిఎం స్టాలిన్‌

తమిళనాడు : తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్‌ హామీ ఇచ్చారు. తమ పార్టీ (డీఎంకే) 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరుస్తున్నట్లు స్టాలిన్‌ వెల్లడించారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అత్యాధునిక హంగులతో కొత్త క్రికెట్‌ స్టేడియం నిర్మాణం చేపడతామని స్టాలిన్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

” క్రికెట్‌ ఔత్సాహికుడినైన నేను ఎలక్షన్స్‌ 2024 కోసం మా ఎన్నికల మేనిఫెస్టోలో మరో వాగ్దానాన్ని జోడించాలనుకుంటున్నాను. కోయంబత్తూరులోని క్రీడాభిమానుల చురుకైన భాగస్వామ్యంతో అత్యాధునిక క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తాను. ఈ స్టేడియాన్ని చెన్నై చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాట రెండో అతి పెద్ద అంతర్జాతీయ క్రికెట్‌ వేదికగా తీర్చిదిద్దుతాను. క్రీడల మంత్రి ఉదయ్ స్టాలిన్‌ రాష్ట్రంలో ప్రతిభను పెంపొందించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి కట్టుబడి ఉన్నాడు. ” అంటూ స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.

➡️