9 మంది ఎంపి అభ్యర్థులతో కాంగ్రెస్‌ జాబితా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :  ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఆదివారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ ఎపిలో 9, జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. ఎపికి సంబంధించి తొలి జాబితాలో 6, రెండో జాబితాలో ఐదు స్థానాలకు అభ్యర్థులను గతంలో ప్రకటించారు. ఇప్పుడు మూడో జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించారు.
పి పరమేశ్వరరావు (శ్రీకాకుళం), బొబ్బిలి శ్రీను (విజయనగరం), జంగా గౌతమ్‌ (అమలాపురం), గొల్లు కృష్ణ (మచిలీపట్నం), వల్లూరు భార్గవ్‌ (విజయవాడ), ఈద సుధాకర్‌రెడ్డి (ఒంగోలు), జె లక్ష్మీ నరసింహ యాదవ్‌ (నంద్యాల), మల్లికార్జున్‌ వజ్జల (అనంతపురం), బిఎ సమద్‌ షహీన్‌ (హిందూపురం)లను ప్రకటించారు. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు ఇండియా బ్లాక్‌లో భాగంగా సిపిఎం, సిపిఐ అరకు, గుంటూరు చెరొక్కటి పోటీ చేయగా, కాంగ్రెస్‌ 23 స్థానాల్లో పోటీ చేస్తుంది.

➡️