ఢిల్లీలో శ్రీను కుటుంబ సభ్యుల ధర్నా

Feb 9,2024 10:40 #delhi protest, #kodi kathi case

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడికి సంబంధించిన కేసులో జైలులో ఉన్న శ్రీను కుటుంబ సభ్యులు ఢిల్లీలో ధర్నాకు దిగారు. గురువారం నాడిక్కడ ఎపి భవన్‌లో అంబేద్కర్‌ విగ్రహం ముందు శ్రీను తల్లి, అన్న సుబ్బరాజు, టిడిపి మైనార్టీ హక్కుల నాయకులు ధర్నా చేపట్టారు. జగన్‌ కోర్టుకు రావాలని, సాక్ష్యం చెప్పాలని నినాదాలు చేశారు. ఎపిలో దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులు ఆపాలని నినాదాలు చేశారు. జగన్‌పై దాడి కేసులో నిందితులు ఎవరనేది జగన్‌ చెప్పాలని శ్రీను కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.

➡️