లడఖ్‌లోని కార్గిల్‌లో భూకంపం

Dec 18,2023 17:17 #Earthquake, #ladakh, #Pakistan

న్యూఢిల్లీ   :   లడఖ్‌లోని కార్గిల్‌లో సోమవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5 గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌ ) తెలిపింది. దీంతో ఉత్తర భారత్‌తో పాటు పాకిస్థాన్‌లో కూడా ప్రకంపనలు వచ్చాయి.   లడఖ్‌లోని కార్గిల్‌ కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. ఉత్తర భారత్‌లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. అలాగే పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ సహా ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించినట్లు పేర్కొంది.   సోమవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అక్కడి మీడియా  వెల్లడించింది.

➡️