పొగమంచు ప్రభావం.. ఆలస్యంగా నడుస్తున్న 26 రైళ్లు..

Jan 2,2024 11:01 #Delhi, #Several trains
  • మరో వారం రోజులపాటు ఇదే తీరు

ఢిల్లీ : ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేయడంతో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు ప్రభావం 26 రైళ్లపై పడిందని, అవన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా నేడు కొన్ని రైళ్లే ఏకంగా ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే పేర్కొంది. కాగా, ఈ వారమంతా వాతావరణం ఇలానే ఉంటుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు 10 నుంచి 7 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది.

➡️