ట్రేడ్‌ యూనియన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నిక

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ 9 నుండి 14 వరకు సెగల్‌లోని డాకర్‌లో జరిగిన టియుఐ ఐదవ అంతర్జాతీయ సదస్సులో కొత్త అధికారులను ఎన్నుకున్నారు. 86 దేశాల నుంచి 141 కార్మిక సంఘాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. టీయూఐ ప్రధాన కార్యదర్శి జూలియన్‌ హక్‌ నివేదికను సమర్పించారు. ప్రారంభ సెషన్‌లో, విజూ కృష్ణన్‌ భారతదేశంలో కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా ఉద్భవిస్తున్న సమస్యల ఆధారిత పోరాటాల గురించి మాట్లాడారు.
కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్‌ వ్యవసాయం, ఆహారం, వాణిజ్యం అనుబంధ పరిశ్రమల రంగాలలో ట్రేడ్‌ యూనియన్‌ ఇంటర్నేషనల్‌ సెక్రటేరియట్‌కు ఎన్నికయ్యారు. ట్రేడ్‌ యూనియన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి రైతు కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షుడు ఎ విజయరాఘవన్‌, ఖేత్మదూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి గుల్జార్‌ సింగ్‌ గోరియా, కిసాన్‌ సభ (అజోరు భవన్‌) అధ్యక్షుడు రావుల వెంకయ్య కూడా ఎన్నికయ్యారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దురాక్రమణ చేస్తున్న నేపథ్యంలో శాంతి , సార్వత్రిక నిరాయుధీకరణకు సదస్సు పిలుపునిచ్చింది. ఈ సదస్సులో
విజూ కృష్ణన్‌, గుల్జార్‌ సింగ్‌ గోరియా , రావుల వెంకయ్యతో పాటు, భారత ప్రతినిధి బృందంలో పి కృష్ణప్రసాద్‌ (ఆర్థిక కార్యదర్శి కిసాన్‌సభ), బి వెంకట్‌ (ఫార్మ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి), విక్రమ్‌ సింగ్‌ (వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యోగ కార్యదర్శి) , విజేంద్ర సింగ్‌ ఉన్నారు. నిర్మల్‌ (బికెఎమ్‌యు) పాల్గొన్నారు.

➡️