road accident : హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

Mar 11,2024 11:58 #Haryana, #road accidents

చండీగఢ్‌ : హర్యానాలోని రెవారీ సమీపంలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత రెవారీ సమీపంలోని మసానీ వద్ద కారు టైర్‌ పంచర్‌ అయింది. దీంతో కారు నడిపే వ్యక్తి కారును రోడ్డు పక్కన నిలిపి.. టైరును మారుస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఎక్స్‌యూవీ కారును ఢకొీట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు సోమవారం తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రయంగా గాయాలపాలయ్యారని, ప్రమాదం ధాటికి కారు పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️