తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

Jan 28,2024 10:42 #road acident, #tamilnadu

చెన్నై : తమిళనాడులో ఇవాళ తెల్లవారుజూమున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. టెంకాసి జిల్లాలోని కడియవల్లూరు వద్ద సిమెంట్ లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన తెన్‌కాసి జిల్లా కడయనల్లూరు దగ్గర చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తెన్‌కాసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️