Fire accident: మధ్యప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం..

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం 9:30 గంటల నుంచి భవనంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఉదయాన్నే సచివాలయానికి వచ్చిన అధికారులు మంటలను గమనించి పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదంలో పలు కీలక పత్రాలు కాలి బూడిదైనట్లు సమాచారం. కాగా ప్రమాద సమయంలో భవనంలో ఐదుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Secretariat

➡️