Kuno National Park: ఐదు కూనలకు జన్మనిచ్చిన ‘గామిని’..

Mar 11,2024 17:05 #Birth, #Cheetah, #Kuno National Park
  •  26కు చేరిన మొత్తం చిరుతల సంఖ్య

కునో నేషనల్‌ పార్క్‌లో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ఐదేళ్ల ఆడ చిరుత ‘గామిని’ ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. ”హై ఫైవ్‌, కునో! 5ఏళ్ల ఆడ చిరుత గామిని ఈరోజు 5 పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో భారతదేశంలో జన్మించిన చిరుత పిల్లల సంఖ్య 13కి చేరుకుంది. భారత గడ్డపై చీతాలు పిల్లలకు జన్మనివ్వడం ఇది నాలుగోసారి” అని భూపేందర్‌ యాదవ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం కునో నేషనల్‌ పార్క్‌లో మొత్తం చీతాల సంఖ్య 26కు చేరిందని అన్నారు. చిరుతలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించినందుకు కునో నేషనల్‌ పార్క్‌లోని అధికారులు, సిబ్బందిని ఆయన ప్రశంసించారు.

➡️