కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన గుజరాత్‌ హైకోర్టు

అహ్మదాబాద్‌ :   పరువు నష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పిటిషన్‌ను గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆప్‌నేత సంజరు సింగ్‌ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. సమన్లను రద్దు చేయాలంటూ ఆప్‌ నేతలు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌ యూనివర్శిటీ తమపై పరువునష్టం కేసును సెషన్స్‌ కోర్టులో కాకుండా మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయలేరని ఆప్‌ నేతలు వాదించారు. ఈ పిటిషన్‌లపై జస్టిస్‌ హస్ముఖ్‌ సుతార్‌ స్పందిస్తూ.. ట్రయల్‌ కోర్టులోనే వారి వాదనలు వినిపించాలని సూచిస్తూ పిటిషన్లను కొట్టేశారు.

ప్రధాని మోడీ విద్యార్హతలపై ఆప్‌ నేతలు అపహాస్యపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ గుజరాత్‌ యూనివర్శిటీ ఏప్రిల్‌ 15న మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

➡️