15న సెంథిల్‌ బాలాజీ బెయిల్‌ పిటీషన్‌ విచారణ

May 7,2024 00:23 #Senthil Balaji, #supreem court

న్యూఢిల్లీ : తమిళనాడు మాజీ మంత్రి వి సెంథిల్‌ బాలాజీ దాఖలు చేసిన బెయిల్‌ పిటీషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది. సోమవారం ఈ పిటీషన్‌ను జస్టిస్‌ ఎఎస్‌ ఒకా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 328 రోజుల నుంచి కస్టడీలో ఉన్నానని, తనకు బెయిల్‌ మంజారు చేయాలని సెంథిల్‌ బాలాజీ ఈ పిటీషన్‌లో కోరారు. బెయిల్‌ మంజారు చేస్తే సాక్షులను, బాధితులను సెంథిల్‌ బాలాజీ ప్రభావితం చేస్తారని ఇడి అభ్యంతరం వ్యక్తం చేసింది. 2014-15 మధ్య జరిగిన జాబ్‌ రాకెట్‌ స్కామ్‌లో సెంథిల్‌ బాలాజీని ఇడి గత ఏడాది జూన్‌లో అరెస్టు చేసింది. సెంథిల్‌ బాలజీ బెయిల్‌ పిటీషన్‌ను ఏప్రిల్‌ 1న మద్రాస్‌ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

➡️