Mayawati : లోక్‌సభ ఎన్నికల్లో బిఎస్‌పి ఒంటరిగానే పోటీ చేస్తోంది : మాయావతి

లక్నో : త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బహుజన సమాజ్‌ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. ఈ మేరకు ఆమె సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. బిఎస్పి పూర్తి సన్నద్ధతతో, బలంతో రానున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బిఎస్‌పి పోరాడుతోంది. ఎన్నికల్లో కూటమి, థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు పుకార్లపై మీడియా తప్పుడు వార్తల్ని ప్రసారం చేస్తుంది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసి మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి.’ అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బహుజన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని బిఎస్‌పి నిర్ణయించుకుంది అని మాయావతి స్పష్టం చేశారు.

➡️