రైతు ప్రయోజనాలను రక్షించే ‘ఇండియా’ : రాహుల్‌ గాంధీ

Apr 16,2024 00:28 #Rahul Gandhi, #Thiruvananthapuram

తిరువనంతపురం : దేశంలో రైతుల ప్రయోజనాలను ‘ఇండియా’ వేదిక కాపాడుతుందని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న ఆయన సోమవారం నియోజకవర్గంలో విసృత్తంగా పర్యటించారు. ఈ సందర్భంగా పుల్పల్లిలో రైతు ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఇండియా వేదిక అధికారంలోకి రాగానే రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోడీ ప్రభుత్వం రైతు రుణాలను మాత్రం మాఫీ చేయలేదని విమర్శించారు. మనంతవాడి, పదింహరేథర, వెల్లముందల్లో రోడ్‌షోల్లో రాహుల్‌ పాల్గొన్నారు.

➡️