జస్టిస్‌ ఫాతిమా బీవి మహిళలకు మార్గదర్శిగా నిలిచారు : ప్రధాని

Nov 24,2023 14:45 #died, #Justice Fathima Beevi, #PM Modi

న్యూఢిల్లీ   :   జస్టిస్‌ ఫాతిమా బీవి మహిళలకు నిజమైన మార్గదర్శిగా నిలిచారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి, తమిళనాడు మాజీ గవర్నర్‌ ఫాతిమా బీవి గురువారం ప్రైవేట్‌ ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మృతికి ప్రధాని మోడీ ఎక్స్‌ (ట్విటర్‌)వేదికగా శుక్రవారం సంతాపం ప్రకటించారు. జస్టిస్‌ ఫాతిమా బీవి    తన జీవన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను ధైర్యంగా దాటుకుని మహిళలను చైతన్యవంతులను చేశారని అన్నారు న్యాయవృత్తికి ఆమె అందించిన సహకారం ఎంతో విలువైనదని ట్విటర్‌లో పేర్కొన్నారు.

➡️