Karnataka: ప్రజ్వల్‌ రేవణ్ణను సస్పెండ్‌ చేసిన జెడిఎస్‌

బెంగళూరు :   మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు, హసన్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణ మంగళవారం జెడి(ఎస్‌) నుండి సస్పెండయ్యారు. అతనికి పార్టీ షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసింది. ప్రజ్వల్‌ రేవణ్ణ రాసలీలల వీడియోలు సోషల్‌మీడియాలో పెనుదుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ అభ్యంతరకర వీడియోలు మూడు వేల దాకా ఉన్నాయి. బాధితురాలు, హెచ్‌.డి. రేవణ్ణ పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపి ప్రజ్వల్‌తో పాటు అతని తండ్రిపై కేసు నమోదు చేశారు.

అయితే ఈ అసభ్యకర వీడియోలు వెలుగులోకి వచ్చిన వెంటనే  ఎంపి ప్రజ్వల్‌   జర్మనీలోని ఫ్లాంక్‌ఫర్ట్‌కు పారిపోయారు.

➡️