Gogamedi murder case :  హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులు

Jan 3,2024 16:45 #NIA

న్యూఢిల్లీ : హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బుధవారం దాడులు నిర్వహించింది. ఈ రెండు రాష్ట్రాల్లో 31 ప్రదేశాల్లో ఎన్‌ఐఎ దాడులు నిర్వహించింది. గత నెలలో రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి హత్య కేసుతో సంబంధం ఉన్న అనుమానితుల ప్రదేశాల్లో దాడులు జరపమని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్‌ఐఎ దాడులు కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసుల సమయన్వయంతో ఎన్‌ఐఎ బృందాలు సోదాలు నిర్వహించాయి.

కాగా, కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడిని డిసెంబర్‌ 5వ తేదీన జైపూర్‌లోని తన నివాసంలో ముగ్గురు కాల్చి చంపారు. గోగమేడి హత్యానంతరం లారెన్స్‌ బిష్ణోరు గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్‌ రోహిత్‌ గోదారాతోపాటు, మరో షూటర్‌ నితిన్‌ ఫౌజిని డిసెంబర్‌ 9వ తేదీన చండీగడ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇక గోగమేడి హత్య కేసును రాజస్థాన్‌ పోలీసుల నుండి ఎన్‌ఐఎ స్వాధీనం చేసుకుంది. కొందరు వ్యాపారవేత్తల నుంచి వసూళ్లకు సంబంధించి గోదార, గోగమేడి మధ్య విభేదాలు తలెత్తాయని, ఇదే హత్యకు దారితీసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

➡️