రైతులపై విరుచుకుపడిన పోలీసులు.. 160 మందికి గాయాలు

Feb 21,2024 17:46 #Farmers Protest, #Punjab

చండీగఢ్‌ :   కనీస మద్దతు ధర కోరుతూ శాంతియుతంగా నిరసనతెలుపుతున్న రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. రైతులపై హర్యానా పోలీసులు టియర్‌గ్యాస్‌ షెల్స్‌, రబ్బర్‌ బుల్లెట్లు, డ్రోన్స్‌తో పాటు బలగాలు దాడికి దిగారు. దీంతో సుమారు 160 మంది గాయపడినట్లు సమాచారం. సరిహద్దుల్లో ఆందోళనకారులు  గుమిగూడేందుకు    అనుమతిస్తోందని పేర్కొనడం పూర్తిగా తప్పుఅని పంజాబ్‌ ప్రభుత్వం పేర్కొంది.   బుధవారం ఉదయం ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కోసం పంజాబ్‌ – హర్యానా సరిహద్దుల్లో 1200 ట్రాక్టర్లు-ట్రాలీస్‌, ఇతర వాహనాలతో సుమారు 14,000 మంది సమాచారం.

➡️