Accident : కేరళ మంత్రి సాజి చెరియన్‌కి తప్పిన ప్రమాదం

Apr 2,2024 16:18 #car accident, #Kerala Minister

అలప్పుజ :    కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం అలప్పుజ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంత్రి ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు.

మంత్రి సాజి చెరియన్‌ కాయంకులం నుండి అలప్పుజ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని కాయంకులం పోలీస్‌ స్టేషన్‌ అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎదురుగా వస్తున్న కారు మంత్రి వాహనాన్ని ఢ కొందని, అనంతరం మంత్రి కారు టిప్పర్‌ లారీని ఢకొీట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుందని అన్నారు.

➡️