మూటలు మోసిన కురుక్షేత్ర బిజెపి అభ్యర్థి జిందాల్‌

Apr 18,2024 23:26 #2024 election, #BJP candidate

హర్యానా : లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల ప్రచారం వేడెక్కుతోంది. ఈ ప్రచారంలో అభ్యర్థులు పోటీపడి ఓటర్లను మెప్పించడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి జిందాల్‌ స్టీల్స్‌ ఛైర్మన్‌ నవీన్‌ జిందాల్‌ పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా నవీన్‌ జిందాల్‌ స్థానిక మార్కెట్‌ యార్డులో మూటలు మోశారు. 50 కేజీల గోధుమ మూటను ఎత్తుకుని లారీలోకి లోడ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా నవీన్‌ జిందాల్‌ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై కురుక్షేత్ర నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవలే ఆయన బిజెపిలోకి దూకారు. బిజెపి టికెట్‌పై ఈ ఎన్నికల్లో పోటీకి దిగారు.

➡️