అయోధ్యకు రానని రాముడు కల్లోకొచ్చి చెప్పాడు : బీహార్‌ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

బీహార్‌ : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం మొత్తం ఎన్నికల స్టంట్‌ అని బీహార్‌ మంత్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ సింగ్‌ అన్నారు. ఈమేరకు ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ … అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 22 న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాముడు రాడని స్పష్టం చేశారు. ఈ విషయం స్వయంగా రాముడే తన కలలోకి వచ్చి చెప్పాడని తెలిపారు. అయోధ్యలో ఇప్పుడు హిపోక్రసీ నెలకొందని, అలాంటి చోటుకు తాను వెళ్లబోనని చెప్పాడన్నారు. ఎన్నికలు అయిపోయాక తనను మరిచిపోతారని వ్యాఖ్యానించినట్లు తేజ్‌ ప్రతాప్‌ తెలిపారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావడంలేదంటూ నలుగురు శంకరాచార్యులు ఇప్పటికే ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ నలుగురు శంకరాచార్యుల కలలోకి వెళ్లి ఇదే విషయం చెప్పినట్లు రాముడు తనతో వివరించారని అన్నారు. అందుకే వారు అయోధ్యకు రావడం లేదని తేజ్‌ ప్రతాప్‌ వివరించారు.

➡️