మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రిజల్ట్స్‌ : టాప్‌ 10లో ఏడుగురు మహిళలు

ఇండోర్‌ :    మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రిజల్ట్స్‌లో టాప్‌ 10లో ఏడుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.  ఈ పరీక్షల్లో ప్రియాంక పాఠక్‌ అగ్రస్థానంలో నిలవగా, డిప్యూటీ పదవికి ఎంపికైనట్లు ప్రకటించారు.  డిప్యూటీ కలెక్టర్‌ పదవికి ఎంపికైన ఇతర టాప్‌ 9 అభ్యర్థులు (ర్యాంకుల వారీగా)  శివంగి బఘేల్‌, పూజా సోనీ, రాహుల్‌ కుమార్‌ పటేల్‌, నిధి మిశ్రా, హర్నీత్‌ కౌర్‌ కల్సి, సౌరభ్‌ మిశ్రా, సలోని అగర్వాల్‌, రితికా పాటిదార్‌ మరియు అశుతోష్‌ మహదేవ్‌ సింగ్‌లు ఉన్నారు.

ఎంపిపిఎస్‌సి నిర్వహించే స్టేట్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ -2019 ఫలితాలను మంగళవారం అర్థరాత్రి విడుదల చేసింది. 2019 స్టేట్‌ సర్వీస్‌ పరీక్షకు సంబంధించి 571 పోస్టులకు మొదట్లో ప్రకటన ఇచ్చామని ఆ అధికారి చెప్పారు. అయితే మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉన్నందున, వీటిలో 87 శాతం పోస్టుల ఫలితాలను ప్రస్తుతం ప్రకటించామని అన్నారు. మిగిలిన 13 శాతం పోస్టుల ఎంపిక జాబితాను ఈ కేసులో తుది తీర్పు వెల్లడైన తర్వాత ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

➡️