Madhya Pradesh : మూడేళ్లలో 31,000కు పైగా మహిళలు మిస్సింగ్‌

Jul 3,2024 12:41 #Madhya Pradesh, #Women Missing

భోపాల్‌ :    గత మూడేళ్లలో మధ్యప్రదేశ్‌లో 31,000 మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారు. అధికారిక నివేదిక ప్రకారం.. 2021 -2024 మధ్య కాలంలో 28,857 మంది మహిళలు, 2,944 మంది బాలికలు అదృశ్యమయ్యారు. అంటే రాష్ట్రంలో రోజుకి సగటున 28 మంది మహిళలు, ముగ్గురు బాలికలు కనిపించకుండా పోతున్నారు. అయితే అధికారికంగా కేవలం 724 మిస్సింగ్‌ కేసులు మాత్రమే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

గడిచిన 34 నెలల్లో ఉజ్జయినిలో 676 మహిళలు అదృశ్యమైనా .. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సాగర్‌ జిల్లాలో అత్యధికంగా తప్పిపోయిన బాలికల సంఖ్య 245గా నమోదైంది. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ లేనివిధంగా ఒక్క ఇండోర్‌లోనే 2,384 మంది మహిళలు మిస్సయ్యారు. ఒక్క నెలలోనే 479 మంది మహిళలు కనిపించకుండా పోగా, కేవలం 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాల బచ్చన్‌ అడిగిన ప్రశ్నకు బిజెపి ప్రభుత్వం ఈ సమాధానమిచ్చింది.

➡️