West bengal : మహువా మొయిత్రా vs రాజమాత

కోల్‌కతా :    తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రాపై స్థానిక రాజమాత అమృతారాయ్‌ని  బిజెపి బరిలోకి దింపింది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారన్న ఆరోపణలతో మహువా మొయిత్రాపై ఎథిక్స్‌ కమిటీ గతేడాది బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే.  అయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ మరోసారి ఆమెను అభ్యర్థిగా ప్రకటించింది.   ఈ ఎన్నికల్లో   ఆమె కృష్ణానగర్‌ నియోజకవర్గం నుండి విజయం సాధించాల్సి వుంది.   బిజెపి ఆదివారం విడుదల చేసిన ఐదవ జాబితాలో  అమృతారాయ్  పేరు కూడా ఉంది.

ఇటీవల ప్రశ్నల కోసం నగదు కేసులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) పోలీస్‌ కేసు నమోదు చేయడంతో పాటు కోల్‌కతాలోని ఆమె నివాసంలో సోదాలు జరిపింది. దీంతో కృష్ణానగర్‌ నుండి తనపై పోటీగా ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేదని బిజెపిపై మహువా ఆగ్రహం వ్యక్తం చేశారు.

2019 ఎన్నికల్లో కృష్ణా నగర్‌ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థి కళ్యాణ్‌ చౌబేపై 60,000 ఓట్ల మెజారిటీతో మహువా విజయం సాధించారు.   అప్పటి నుండి బిజెపిపై పలు ప్రశ్నలు సంధించారు.

➡️