ఐస్‌క్రీంలో అవయవం ఎవరిదో తెలిసింది..

Jun 28,2024 07:41 #Mumbai, #special news

ముంబై: ఆర్డర్ చేసిన ఐస్‌క్రీంలో అవయవం ఎవరిదో తెలిసింది. వేలికున్న డీఎన్ఏ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగి ఓంకార్ పోటేదిగా తేలిందని పోలీసులు గురువారం తెలిపారు.  ఇటీవల ముంబైలో ఓ డాక్టర్ ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు రావడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా అధికారులు అరా తీయడం మొదలుపెట్టారు. వేలు ఎవరిదో కనుక్కునేందుకు దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు. ఇందాపూర్ ఫ్యాక్టరీలో కోన్‌లో ఐస్‌క్రీం నింపే సమయంలో ఓంకార్ వేలిలో కొంత భాగం కట్ అయింది. ఇది ఆ తర్వాత ఐస్‌క్రీం కొన్‌లో పడిపోయింది. అలా అది ఆర్డర్ చేసిన ఐస్‌క్రీంలో డాక్టర్ కు చేరింది.

ఈ ఘటన డాక్టర్ ఫెర్రాన్ మాట్లాడుతూ..‘‘ నేను ఐస్ క్రీం మధ్యలోకి రాగానే, అకస్మాత్తుగా నాకు అక్కడ పెద్ద ముక్క అనిపించింది. మొదట్లో, అది పెద్ద గింజ అని నేను అనుకున్నాను. అదృష్టవశాత్తూ, నేను తినలేదు. అయితే, దానిని దగ్గరగా చూసిన తర్వాత, నేను దానిపై ఒక గోరును చూశాను.’’ అని చెప్పారు. ఈ ఘటనతో షాక్‌కి గురయ్యానని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

➡️