కారు ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు స్వల్పగాయం

కోల్‌కతా :    పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు స్వల్పగాయమైనట్లు అధికారులు తెలిపారు. బర్దమాన్‌ నుండి కోల్‌కతా వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అననుకూల వాతావరణం కారణంగా హెలికాఫ్టర్‌ ప్రయాణం రద్దవడంతో కారులో కోలకతాకు బయల్దేరారు. అయితే పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఎదురు సీటులో కూర్చున్న మమతా బెనర్జీ .. విండ్‌స్క్రీన్‌ను  ఢీ కొన్నారు.   దీంతో ఆమె తలకు స్వల్పగాయమైంది. కోల్‌కతాలో వైద్యులు పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.

➡️