లుథియానా ఫ్లైఓవర్‌పై అగ్ని ప్రమాదం .. ఎగిసిపడుతున్న మంటలు

చంఢీఘర్  :  పంజాబ్‌లోని లుథియానా ఫ్లైఓవర్‌పై బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీ కొన్న ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడటంతో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.  ఆప్రాంతంలో ఓ వైపు మంటలు ఎగిసిపడుతుండగా, ఆకాశం వరకు దట్టమైన నల్లని పొగ అలుముకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.   వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

ఖన్నా సమీపంలోని జాతీయ రహదారిపై ఆయిల్‌ ట్యాంకుకు మంటలు అంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

➡️