ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Mar 14,2024 09:22 #Delhi, #Fire Accident

సకాలంలో స్పందించిన అధికారులు 

ఢిల్లీ : ఢిల్లీ షాహదారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలోని నివాస భవనంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీనియర్ పోలీసు అధికారి తెలియజేస్తూ… “గీతా కాలనీ సమీపంలోని శాస్త్రి నగర్‌లో పెద్ద అగ్నిప్రమాదం గురించి ఉదయం 5:20 గంటలకు మాకు కాల్ వచ్చింది. మేము వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌కు సమాచారం అందించాము. ఒక పోలీసు బృందం, నాలుగు ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్‌లు మరియు పిసిఆర్ వ్యాన్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయ”న్నారు. మంటలు చెలరేగిన భవనంలో నాలుగు అంతస్తులు ఉన్నాయని, గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్ పార్కింగ్ సౌకర్యం ఉందని పోలీసులు తెలిపారు. పార్కింగ్ స్థలం నుంచి మంటలు చెలరేగాయని, పొగలు మొత్తం భవనాన్ని చుట్టుముట్టాయని వారు తెలిపారు.

“వీధి ఇరుకైనప్పటికీ, అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ప్రతి అంతస్తులో తనిఖీ చేశారు. ముగ్గురు పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలను రక్షించి హెడ్గేవార్ ఆసుపత్రికి పంపారు” అని అధికారి తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

➡️