రైసీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది : మోడి

May 20,2024 11:00 #death, #Iran President, #PM Modi, #shocked

న్యూఢిల్లీ : హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త విని ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ … ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. భారత్‌-ఇరాన్‌ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఇరాన్‌ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఈ విచారకర సమయంలో ఇరాన్‌కు అండగా ఉంటాం అని తెలిపారు.

➡️