జార్ఖండ్ లో ‘రేషన్ బంద్’

more-than-25000-fair-price-shop-dealers-from-jharkhand-join-nationwide-ration-bandh-

జార్ఖండ్ : ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ (AIFPSDF) ఇచ్చిన దేశవ్యాప్త నిరవధిక ‘రేషన్ బంద్’ లో భాగంగా ఈరోజు జార్ఖండ్‌కు చెందిన 25,000 మందికి పైగా దుకాణ డీలర్లు పాల్గొన్నారు. డీలర్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ మాట్లాడుతూ “ఇది దీర్ఘకాలం కొనసాగితే జాతీయ మరియు రాష్ట్ర ఆహార భద్రతా పథకాల కింద కవర్ చేయబడిన జార్ఖండ్‌లో 65 లక్షల మందికి పైగా లబ్ధిదారులపై సమ్మె ప్రభావం చూపవచ్చు” అని తెలిపారు. డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌పిఎస్‌డిఎ) జార్ఖండ్ యూనిట్ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుందు పిటిఐతో మాట్లాడుతూ డీలర్లకు కనీస నెలవారీ ఆదాయ హామీని అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా ‘రేషన్ బంద్’కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. డీలర్లకు కనీస నెలవారీ ఆదాయం రూ.50,000 హామీ ఇవ్వడం, ప్రపంచ ఆహార కార్యక్రమం యొక్క సిఫార్సులను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కమీషన్‌ను కిలోకు రూ.1 నుండి 3 కి పెంచాలని మరియు డీలర్ మరణిస్తే కారుణ్య ప్రాతిపదికన కుటుంబ సభ్యునికి దుకాణం అందించాలని డిమాండ్ చేశారు. వీటిపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ డీలర్ల కమీషన్‌ను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు.

➡️