నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ సోదాలు : ఎనిమిది మంది అరెస్టు

Dec 19,2023 09:46 #arrested, #Eight, #four, #NIA, #searches

బెంగళూరు : నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించా రు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐఎస్‌ఐఎస్‌)తో సంబంధాలున్న మినాజ్‌ అలియాస్‌ మహ్మద్‌ సులేమాన్‌తో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ‘ఐఇడి పేలుళ్లను నిర్వహించడానికి నిందితులు బళ్లారిలో వేసిన ప్రణాళికను భగం చేశాం’ అని ఎన్‌ఐఎ పేర్కొంది. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరుల్లో నూ మహారాష్ట్రలోని అమరావతి, ముంబయి, పుణేల్లోనూ, జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌, బోకరోల్లోనూ ఈ సోదాలు జరిగాయి. బళ్లారి మాడ్యూల్‌పై ఈ నెల 14న ఎన్‌ఐఎ కేసు నమోదు చేసింది. అరెస్టయిన వారిలో బళ్లారికి చెందిన మినాజ్‌ అలియాస్‌ మహ్మద్‌ సులేమాన్‌, సయ్యద్‌ సమీర్‌, ముంబయికి చెందిన అనాస్‌ ఇక్బాల్‌ షేక్‌, మహ్మద్‌ మునీరుద్దీన్‌, సయ్యద్‌ సమీవుల్లా అలియాస్‌ సమీ, బెంగళూరుకు చెందిన మహ్మద్‌ ముజమ్మిల్‌, ఢిల్లీకి చెందిన షయాన్‌ రహమాన్‌ అలియాస్‌ హుస్సేన్‌, మహ్మద్‌ అలియాస్‌ ఝుల్‌బాజ్‌ ఉన్నారు.

➡️