సియుఇటి-యుజి పరీక్ష తేదీల్లో ఎటువంటి మార్పు లేదు : యుజిసి చీఫ్‌

Mar 17,2024 16:40 #CUET-UG schedule, #UGC Chief

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటికీ.. కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సియుఇటి) యుజి పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని యుజిసి చైర్మన్‌ జగదీష్‌ కుమార్‌ ఆదివారం ప్రకటించారు. సియుఇటి-యుజి పరీక్షలను ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది మే 15, మే 31 మధ్య యథావిథిగా నిర్వహిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం తేదీ షీట్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

➡️