Parakala: స్పష్టమైన దేశ భవిష్యత్తు రూపొందించే సమయం : పరకాల ప్రభాకర్

Jun 17,2024 08:01 #BJP Govt, #Parakala Prabhakar, #Seminar

కోజికోడ్ : పార్లమెంట్లో బిజెపికి పూర్తి మెజారిటీ లేని తరుణంలో స్పష్టమైన, విస్తృతమైన దేశ భవిష్యత్తును రూపొందించాలని ప్రముఖ ఆర్థికవేత్త డా.పరకాల ప్రభాకర్ అన్నారు. కేరళ ఎన్జీవో యూనియన్  రాష్ట్ర సదస్సుకు సంబంధించి ఏర్పాటు చేసిన కల్చరల్ ఫెస్ట్ ‘ఇండియాస్ ఫ్యూచర్ ప్రెజెంట్స్’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజ్యాంగం ఒక మతం, భాష లేదా భూభాగం ఆధారంగా వివక్ష చూపదని స్పష్టం చేశారు. సమానత్వం, సౌభ్రాతృత్వం ఉండేలా రాజ్యాంగం రూపొందించబడిందన్నారు. దేశ రాజ్యాంగం అందరి కోసం రూపొందించబడిందన్నారు. దేశ భవిష్యత్తు 5 వేల ఏళ్ల క్రితం నాటిది కాకూడదన్నారు. నిరంతర పోరాటం, జాగరణ, కృషి మాత్రమే భారతదేశాన్ని శాస్త్రీయ దృక్పథంతో లౌకిక, ఆధునిక, సహనశీల, ప్రజాస్వామ్య, ఆధునిక దేశంగా మారుస్తుందని పరకాల ప్రభాకర్ అన్నారు.

➡️