Protest: అక్రమంగా తవ్విన చెరువును పూడ్చేయాలి 

ప్రజాశక్తి – పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో తానాం గ్రామానికి ఆనుకొని అక్రమంగా రాంకీ యాజమాన్యం తవ్వకాలు చేసిన చెరువుని మూసివేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం తానాం గ్రామ ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రాంకీ యాజమాన్యం అక్రమంగా తవ్విన చెరువు పై, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయడం జరిగిందని, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రీన్ బెల్ట్ నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు సాగించిన చెరువుని మూసివేయాలని ఆదేశాలు ఇచ్చినా, నేటికీ మూసి వేయకపోవడం అన్యాయమన్నారు. ఈ చెరువులోకి ఫార్మా రసానికి వ్యర్ధ జలాలు చేరడం వలన భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయని, పశువులకు, మనుషులకి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, వెంటనే ఈ చెరువును మూసివేయాలని గ్రీన్ బెల్ట్ ని అభివృద్ధి చేయాలని, కాలుష్యం అరికట్టాలని, కాలుష్యం తానాం గ్రామ ప్రజలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోంగలి అప్పారావు, వర్రీ భవాని, వి.కన్నంనాయుడు, వర్రీ అప్పారావు, ఆర్. ఎర్రయమ్మ, వి. సన్యాసి, దేవుడు తదితరులు పాల్గొన్నారు.

➡️