మరోసారి రైతులపై టియర్‌గ్యాస్‌ ప్రయోగం

అంబాలా :    రైతులపై పోలీసులు మరోసారి టియర్‌గ్యాస్‌తో విరుచుకుపడ్డారు. బుధవారం ఉదయం పంజాబ్‌ -హర్యానాలోని శంబు సరిహద్దు నుండి ఢిల్లీ చలో నిరసనను ప్రారంభిస్తున్న రైతులపై టియర్‌గ్యాస్‌ ప్రయోగించినట్లు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే 144 సెక్షన్‌ విధించడంతో పాటు ట్రాక్టర్‌ ట్రాలీలు, సమావేశాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రైతుల నిరసన, అధికారుల భద్రతా తనిఖీల కారణంగా ఢిల్లీ-ఘజియాబాద్‌ సరిహద్దుల్లో బుధవారం భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

రైతుల నిరసనను అణచివేసేందుకు మోడీ ప్రభుత్వం  తీవ్రంగా యత్నిస్తోంది. సరిహద్దుల్లో   కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప కంచెలు, మేకులు,  ఏర్పాటు చేసింది.  పోలీసులతో పాటు పెద్ద ఎత్తున పారామిలటరీ దళాలను మోహరించింది.  మంగళశారం కూడా రైతులపై వాటర్ కెనాన్,  టియర్ గ్యాస్‌తో విరుచుకుపడింది. కొందరు రైతులను అదుపులోకి తీసుకుంది.

➡️