వందేళ్ల అనుబంధం- రాయబరేలిలో పోటీపై రాహుల్‌ గాంధీ

May 14,2024 00:06 #Delhi, #Rahul Gandhi's meeting

న్యూఢిల్లీ : రాయబరేలితో తన కుటుంబానికి వందేళ్ల అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజల కోసం తమ కుటుంబం నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. రారుబరేలీలో పోటీ చేస్తున్న ఆయన తొలిసారి సోమవారం నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడారు. ఈ ప్రాంతం తన ఇద్దరు తల్లులు సోనియాగాంధీ, ఇందిరాగాంధీల కర్మభూమి అని, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. దేశ చరిత్రలోనే తొలిసారి బిజెపిా ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇండియా వేదిక అధికారంలోకి వస్తే పేద రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మోడీ ఇద్దరు పారిశ్రామిక వేత్తల కోసమే పనిచేస్తున్నారని, సాధారణ ప్రజలు, ఇతరుల గురించి ఆలోచించరని విమర్శించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) పథకం కోసం 24 ఏళ్లకు కేటాయించిన నగదుకు సమానమైన రూ.16 లక్షల కోట్ల రుణాలను మోడీ ప్రభుత్వం కేవలం 22 నుంచి 25 మంది పారిశ్రామికవేత్తలకు మాఫీ చేసిందని విమర్శించారు.

➡️