రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుడు.. ఇద్దరు అరెస్ట్‌!

ఢిల్లీ : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న పేలుడుకు పాల్పడిన కీలక నిందితుడు ముస్సావిర్‌ హుస్సేన్‌ షాజిబ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం అరెస్ట్‌ చేసింది. అతనితో పాటు సూత్రధారి అబ్దుల్‌ మతీన్‌ తాహాను కూడా ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలో12, తమిళనాడులో 5, ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట ఇలా మూడు రాష్ట్రాల్లోని 18 ప్రాంతాల్లో తనిఖీల అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

➡️