మిచౌంగ్‌ బాధిత కుటుంబాలకు రూ.6000 చొప్పున పరిహారం- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌

Dec 10,2023 08:22 #cm stalin, #Tamil Nadu

చెన్నయ్ : తమిళనాడులో మిచౌంగ్‌ తుపాను బాధితులకు కుటుంబానికి రూ.6000 చొప్పున పరిహారం అందజేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ శనివారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొరికి రూ.4 లక్షలు చొప్పున అందజేస్తున్న పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచారు. మిగిలిన పరిహారాన్ని కూడా గతం కంటే పెంపుదల చేశారు. స్వల్ప మరమ్మత్తుల కోసం ఇంటికి రూ.8 వేలు, వరి పంట హెక్టారుకు రూ.17 వేలు, కొబ్బరి వంటి దీర్ఘకాల పంటలకు హెక్టారుకు రూ.22500, ఆరుతడి పంటలకు హెక్టారుకు రూ.8500, ఆవులు, గేదేలకు ఒక్కొ పశువుకు రూ.37500, మేకలు, గుర్రెలు ఒక్కొ జీవానికి రూ.4 వేలు చొప్పున పరిహారమిస్తారు. మత్స్యకారులకు పూర్తిగా వలలు దెబ్బతినివుంటే రూ.50 వేలు, స్వల్పగా దెబ్బతిన్న పడవలకు రూ.15 వేలు, వల్లం తరహా పడవలకు గరిష్ట పరిహార మొత్తాన్ని రూ.లక్షకు పెంచి ఇవ్వనున్నారు. పూర్తిగా దెబ్బతిన్న మర పడవలకు రూ.7.5 లక్షల చొప్పున పరిహారమిస్తారు.

➡️