రాజ్యసభ ఎన్నికల సమయంలో .. చీఫ్‌ విప్‌ పదవికి ఎస్‌పి ఎమ్మెల్యే రాజీనామా

న్యూఢిల్లీ :    కీలక రాజ్యసభ ఎన్నికల సమయంలో  సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పి) ఎమ్మెల్యే మనోజ్‌ కుమార్‌ పాండే మంగళవారం ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు పంపారు. ”మీరు నన్ను యుపి అసెంబ్లీలో పార్టీ చీఫ్‌ విప్‌గా ని\యమించారు. అయితే ఆ పదవికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామాను ఆమోదించండి” అని లేఖలో పేర్కొన్నారు.  మనోజ్‌ కుమార్‌ పాండే రారుబరేలిలోని ఊంచహార్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మనోజ్‌ కుమార ్‌ గతంలో అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రిగా పనిచేశారు.

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ సోమవారం నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన మరుసటి రోజు మనోజ్‌ కుమార్‌ రాజీనామా చేయడం గమనార్హం. కాగా, ఈ సమావేశానికి మనోజ్‌ కుమార్‌ పాండేతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ఈ విషయాన్ని పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి ధృవీకరించారు.

➡️