సమాజ్ వాది పార్టీకి చెందిన సీనియర్‌ ఎంపి మృతి

Feb 27,2024 12:00 #died, #Samajwadi Party MP

న్యూఢిల్లీ  :  సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పి) ఎంపి షాఫీఖర్‌ రెహమాన్‌ బార్క్‌ (93) మంగళవారం ఉదయం మరణించారు. మొర్దాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పార్టీ ప్రకటించింది. ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సంభాల్‌ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బార్క్‌ 2019లో ఐదవసారి ఎంపిగా ఎన్నికయ్యారు.

ఎస్‌పి సీనియర్‌ నేత, ఎంపి షఫీకర్‌ బార్క్‌ మృతి బాధాకరమంటూ ఎస్‌పి ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

➡️