Gyanvapi mosque: కాశీ విశ్వనాథ ఆలయ ధర్మకర్తలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్‌పై కాశీవిశ్వనాథ ఆలయ ధర్మకర్తలకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులిచ్చింది. మసీదు దక్షిణ సెల్లార్‌లో హిందువులు నిర్వహిస్తున్న పూజలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మసీదు కమిటీ పిటిషన్‌పై పూజారి శైలేంద్ర కుమార్‌ పాఠక్‌ వ్యాస్‌ ఏప్రిల్‌ 30లోగా స్పందించాలని సిజెఐ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. వారణాసిలోని జ్ఞానవాపి ప్రాంగణంలో ముస్లింలు నమాజ్‌పై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. మసీదు దక్షిణ సెల్లార్‌లో హిందువుల పూజలకు అనుమతిస్తూ ఈ ఏడాది జనవరి 31న జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను ఫిబ్రవరి 26న అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది.

➡️