పిఎం ఆర్థిక సలహాదారుని వ్యాఖ్యలపై సుప్రీం

May 23,2024 07:44 #Supreme Court

ఢిల్లీ : న్యాయమూర్తులు కొన్ని గంటలు మాత్రమే పని చేస్తారని, సుదీర్ఘ సెలవులు తీసుకుంటారని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. ‘‘న్యాయమూర్తులు కష్టపడి పనిచేసినా.. కొన్ని గంటలు మాత్రమే పని చేస్తారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. నిర్ణీత గడువులోగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క పిటిషన్‌ కూడా దాఖలవడం లేదు. ఆలస్యానికి క్షమించాలని కోరుతూ అన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. సెలవుల్లో కూడా అర్థరాత్రి పని చేసేవారిలో తామూ ఉన్నాం’ అని వెకేషన్ బెంచ్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ దీపంకరదత్త చెప్పారు.

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఈ పరిశీలనతో పూర్తిగా ఏకీభవించారు. సంజీవ్ సన్యాల్ విమర్శలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ కూడా ముందుకు వచ్చారు.

➡️