హేమంత్‌ సొరేన్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

May 22,2024 13:16 #bail petition, #canceled, #Hemant Soren

రాంచీ : జార్కండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌కు షాక్‌ తగిలింది. లోక్‌ సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ దాఖలు చేయాలని కోరుతూ హేమంత్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. ట్రయల్‌ కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మధ్యంతర బెయిల్‌ ఎలా మంజూరు చేయగలమని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.  సొరేన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది.

➡️