ఆశ్చర్యకర ఫలితాలు తథ్యం

May 24,2024 08:22 #Rahul Gandhi, #speech

ఇండియా ఫోరందే అధికారం
-రాహుల్‌ గాంధీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ తెలిపారు. దేశంలోని 90 శాతం పేద ప్రజలు తమ వెంట ఉన్నారని, ఇండియా ఫోరం అధికారంలోకి రానుందని అన్నారు. గురువారం నాడిక్కడ ఏపి, తెలంగాణ భవన్‌ లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ తో కలిసి లంచ్‌ చేశారు. అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు సీట్లనూ ఇండియా ఫొరం గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగం, రిజర్వేషన్లపై మోడీ, బిజెపి దాడి చేస్తోందని ఫైర్‌ అయ్యారు. దేశ ప్రధానిగా మోడీ 22 మంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పని చేశారని విమర్శించారు. దేశ సంపదను ఆదానీ కి దోచిపెట్టారని ఆరోపించారు. దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమని రాహుల్‌ పేర్కోన్నారు.

➡️