బడ్జెట్‌ సమావేశాలకు 90 శాతం మంది సస్పెండ్‌ ఎంపిలు

parliament session on budget
  • 31న రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశంతో ప్రారంభం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సస్పెండైన 146 మంది ఎంపిల్లో 90 శాతం మంది లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కానున్నారు. మిగిలిన 10 శాతం (14 మంది) పార్లమెంట్‌ సభ్యులపై సస్పెన్షన్‌ కొనసాగుతుంది. వారు ప్రత్యేక హక్కుల ఉల్లంఘనను ఎదుర్కొంటున్నందున విచారణలో ఉన్నారు.పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభ రెండూ డిసెంబరు 29న ప్రోరోగ్‌ చేయబడ్డాయి. దీంతో 132 మంది ఎంపిల సస్పెన్షన్‌ గడువు ముగిసింది. వారిపై శిక్షార్హమైన చర్య సెషన్‌కు మాత్రమే చెల్లుతుంది. ఇద్దరు చొరబాటుదారులు పొగ డబ్బాలతో లోక్‌సభలోకి దూకడంతో భద్రతా లోపం వెల్లడైంది. పార్లమెంట్‌ సమావేశాల్లో రెండు సభల నుండి సస్పెండ్‌ చేయబడిన ప్రతిపక్ష ఎంపిల సంఖ్య (146) పరంగా రికార్డు సృష్టించింది. 31న పార్లమెంట్‌ బడ్జెట్‌ భేటీజనవరి 31 నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో కుదించబడిన బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభమవుతుంది. ఓట్‌ ఆన్‌ అకౌంట్స్‌ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడతారు. ఆ తర్వాత రెండు అంశాలపై చర్చ జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున, కొత్త ప్రభుత్వం జూన్‌లో పూర్తి బడ్జెట్‌ను సమర్పించనుంది.

➡️