Manipur: సహాయక శిబిరాల్లో తాత్కాలిక పాఠశాల

ఇంఫాల్ : అల్లర్లు కొనసాగుతున్న మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లా సహాయక శిబిరాల్లో తాత్కాలిక పాఠశాల తెరిచారు. మండల విద్యాశాఖ కార్యాలయం నేతృత్వంలో 15 నుంచి పాఠశాలను ప్రారంభించారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్ధులకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, 6 నుంచి 8వ తరగతి విద్యార్ధులకు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తరగతులు ఉంటాయి. మొత్తం 88 మంది విద్యార్థులు ఉన్నారు. మీథీ మరియు కుకీ విభాగాల మధ్య అల్లర్లు చెలరేగిన జిరిబామ్‌లోని సహాయక శిబిరాలకు ఇప్పటివరకు 943 మందిని తరలించారు.

➡️