కేరళ అంటే. ఇదీ..!

Mar 27,2024 23:50 #kerala

మసీదు సైన్‌బోర్డులో మందిరానికి చోటు
తిరువనంతపురం : ఎల్‌డిఎఫ్‌ పాలనలోని కేరళ మతసామరస్యానికి ప్రతీకగా మరోమారు నిలిచింది. బిజెపి పాలనలో ఉన్న అస్సాం, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో మత విద్వేషం పెచ్చుమీరుతుంటే… కేరళ మతసామరస్యంతో ముందుకు సాగుతోంది. రాజధాని తిరువనంతపురానికి సమీపంలోని వెంజరమూడ్‌లో ఇటీవల చాముండేశ్వరి ఆలయాన్ని పునర్నిర్మించారు. స్థల సమస్య కారణంగా సైన్‌ బోర్డును ఏర్పాటు చేయడానికి దేవస్థానం యాజమాన్యం ఇబ్బంది పడుతోంది. దీనిని గమనించిన ఆలయానికి సమీపంలో ఉన్న పారాయిల్‌ మసీదు తన సైన్‌బోర్డులో సగభాగాన్ని మందిరం కోసం ఇచ్చింది. దీంతో ఒకే సైన్‌బోర్డులో మందిరం, మసీదుకు చెందిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోను, వార్తను సిపిఎం ఎంపి జాన్‌ బిట్ట్రాస్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. కేరళ అంటే ఇదీ… అని పేర్కొన్నారు. కేరళలో ఇంకా ఖాతా తెరవలేకపోతున్న వారికి ఇది ఆశ్చర్యకరమే.. అని బిజెపిని ఉద్దేశించి బ్రిట్టాస్‌ కామెంట్‌ చేశారు.

➡️